మరీ ఇంత ఓవరా?... వాతావరణంపై రిపోర్టు ఇస్తూ రిపోర్టర్ చేసిన 'అతి'పై విమర్శలు!
- ఫ్లోరెన్స్ తుపానుపై రిపోర్టింగ్
- బలమైన గాలులకు నిలబడలేకపోయిన రిపోర్టర్
- అతడి వెనకే జనాలు మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోయిన వైనం
అక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బలమైన గాలులకు అతడు నిల్చోవడమే కష్టంగా ఉంటే.. అతడి వెనకనే ఇద్దరు వ్యక్తులు అక్కడసలు గాలే లేనట్టు మామూలుగా నడుచుకుంటూ పోతున్నారు. వారంత మామాలుగా నడుస్తూ వెళ్లిపోతుంటే సీడెల్ మాత్రం అసలు నిలబడడమే కష్టంగా ఉన్నట్టు చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిపోర్టర్ అతి చేశాడని, ఓవర్ డ్రామా కట్టిపెట్టాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరైతే సీడెల్కు ‘ఆస్కార్’ ఇవ్వొచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు.