తన ప్రేమను అంగీకరించడం లేదన్న కసితో.. దారుణంగా హత్య చేశాడు!

15-09-2018 Sat 19:03 | National
  • ఇంటర్ వరకూ కలిసి చదువుకున్న కమలేష్, సుప్రియ
  • చెయ్యి కోసుకుని మరీ సుప్రియ ప్రేమను గెలుచుకునే యత్నం
  • మరొరికతో సన్నిహితంగా ఉంటోందనే కోపంతో హత్య
వన్ సైడ్ లవ్ అన్నది ఒక్కోసారి ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో తెలిపే సంఘటన ఇది. తనను ప్రేమించాలంటూ ఓ యువతిని ఎన్నిసార్లు అర్థించినా... ఒప్పుకోకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే కారణంతో ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మొత్తం 38 సార్లు కత్తితో పొడిచి ఆమె ప్రాణాలు తీశాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కమలేష్ సాహూ, సుప్రియా జైన్ ఇంటర్ వరకూ కలిసి చదువుకున్నారు. 6 ఏళ్లుగా కమలేష్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో అతను తన చెయ్యి కోసుకుని మరీ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. కానీ సుప్రియ అతని ప్రేమకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమె పైచదువుల కోసం ఇండోర్ వెళ్లింది.

ఫేస్‌బుక్ ద్వారా ఆమె ఎక్కడుందో తెలుసుకున్న కమలేష్.. ఇండోర్ వెళ్లాడు. అక్కడ సుప్రియ మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. గురువారం రాత్రి ఒంటరిగా వెళుతున్న సుప్రియపై కత్తితో దాడి చేశాడు. ముఖంతో పాటు ఆమె ఇతర శరీర భాగాలపై 38 సార్లు కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కమలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుప్రియను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
kamalesh sahooMadhya Pradesh

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more