ఆ పాత్ర నాగార్జున కోసం అనుకున్నది కాదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పాత్ర నాగార్జున కోసం అనుకున్నది కాదట!

  • రజనీకాంత్ గారి కోసం ఆ పాత్రను డిజైన్ చేశాను 
  • రాజకీయాలతో ఆయన బిజీగా వున్నారు 
  • ఆ కారణంగానే తనకి కుదరదని చెప్పారు
తెలుగు .. తమిళ భాషల్లో ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. నటనపైనే కాదు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణంపై కూడా ఆయనకి మంచి పట్టుంది. మొదటి నుంచి కూడా కొత్త కథలకి ప్రాధాన్యతనిచ్చే ధనుశ్, తాజాగా మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోగా ధనుశ్ నటిస్తుండగా .. మరో హీరోగా నాగార్జునను ఎంపిక చేసుకున్నాడు. రీసెంట్ గా మధురైలో జరిగిన షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో నాగార్జున జాయిన్ కానున్నారట.

తాజా ఇంటర్వ్యూలో ధనుశ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నాగార్జునగారు చేస్తోన్న పాత్ర ముందుగా ఆయన కోసం అనుకున్నది కాదు. ఈ పాత్రను రజనీకాంత్ గారితో చేయించాలనే ఉద్దేశంతో ఆయనను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినది. రజనీకాంత్ గారు రాజకీయాలతో బిజీగా వుంటూ తాను చేయలేనని చెప్పేశారు. దాంతో నాగార్జున గారైతే బాగుంటుందని అనుకున్నాను. 70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, నాగార్జునగారికి గల క్రేజ్ కారణంగా తెలుగులోను దూసుకుపోతుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 
nagarjuna
dhanush

More Telugu News