అనంతపురం జిల్లాలో 'సవాళ్ల'తో ఉద్రిక్తత.. వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్!
- రాయదుర్గంలో అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ సవాళ్లు
- గోపులాపురంలో బహిరంగ చర్చకు ఏర్పాటు
- శాంతిభద్రతల రీత్యా అడ్డుకున్న పోలీసులు
మంత్రి కాలువ గోపులాపురం బయలుదేరుతుండగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆయనతో చర్చించారు. అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనీ, సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉండాలని కోరారు. ఎస్పీ విజ్ఞప్తితో మంత్రి శ్రీనివాసులు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలతో పాటు 100 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.