హీరో శివాజీ చెప్పినట్టే జరుగుతోంది: మురళీమోహన్
- చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటూ శివాజీ చెప్పినట్టుగానే జరుగుతోంది
- బాబును అప్రతిష్టపాలు చేయడం బీజేపీ వల్ల కాదు
- చంద్రబాబును అరెస్ట్ చేస్తే.. మమ్మల్ని అరెస్ట్ చేయమంటాం
ఇటీవలే శివాజీ మాట్లాడుతూ కొన్ని రోజుల్లోనే చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటూ సంచలన విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ కొత్త రూపు దాల్చుకుందని తెలిపారు. ఢిల్లీ నుంచి ఈ మేరకు తనకు పక్కా సమాచారం అందిందని... రెండు మూడు రోజులు ఆలస్యమైనా చంద్రబాబుకు నోటీసులు రావడం ఖాయమని చెప్పారు.