రాజన్న జిల్లాలో పోలీస్ జులుం.. ఫైన్ కడతానని చెబుతున్నా వినిపించుకోకుండా వ్యక్తిపై దాడి!
- నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని ఆపిన రామారావు
- ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్సై
- బాధితుడిని మెడపట్టి జీప్ లో పడేసిన పోలీసులు
కోనారావుపేటకు చెందిన రామారావు తన కారును నో పార్కింగ్ జోన్ లో ఆపాడు. దీంతో అటుగా వచ్చిన స్థానిక ఎస్సై ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిని జీప్ ఎక్కించాలని ఆదేశించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కారు నుంచి బయటకు లాగడం మొదలు పెట్టారు. తాను ఎక్కడికీ పారిపోననీ, జరిమానా కడతానని చెబుతున్నా వినిపించుకోలేదు. చివరకు అతడిని మెడపట్టి బయటకు లాగి పోలీస్ జీప్ లోకి తోసేశారు. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.