కేటీఆర్ తో భేటీ అనంతరం అలకవీడిన హైదరాబాద్ మేయర్.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో బొంతు!
- నిన్న కేటీఆర్‌తో సమావేశమైన అనంతరం రంగంలోకి దిగిన బొంతు
- గ్రేటర్‌లో పలు నియోజకవర్గాల నాయకులతో చర్చలు
- పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చేలా కృషి
అసంతృప్తులతో ఫోన్‌లో కేటీఆర్‌తో కూడా మాట్లాడించినట్లు సమాచారం. ఎంపీ మల్లారెడ్డితో కలిసి ఎల్‌బినగర్‌లోని ఏడుగురు కార్పొరేటర్లతో మాట్లాడి, నియోజక వర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్. రామ్మోహన్‌గౌడ్‌కు మద్దతిచ్చేలా ఒప్పించారు. మరోపక్క కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఉప్పల్ నేత బండారి లక్ష్మారెడ్డి మేయర్‌తో సమావేశమైనట్లు సమాచారం.