పోలీస్ స్టేషన్లో ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే వీరంగం.. మహిళా ఎస్సైకి హెచ్చరిక!
- మహిళా ఎస్సైపై రుద్రపూర్ బీజేపీ ఎమ్మెల్యే దుర్భాషలు
- పోలీస్ స్టేషన్లోనే రెచ్చిపోయిన ఎమ్మెల్యే
- వైరల్ అవుతున్న వీడియో
ఓ వాహనంపై వెళ్తున్న జంటను ఆపిన అనిత వాహన పత్రాలు చూపించమని అడిగారు. వారు చూపించకపోవడమే కాకుండా ఎస్సైను దుర్భాషలాడారు. దీంతో ఆమె వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలిసిన తుక్రాల్ పోలీస్ స్టేషన్కు వచ్చి అనితపై రెచ్చిపోయారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సదానంద దాతె మాట్లాడుతూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.