పెట్రోలు ధరల పెరుగుదలపై చేతులెత్తేసిన కేంద్రం!
- డాలర్ బలపడడమే ఇంధన ధరల పెరుగుదలకు కారణం
- అంతర్జాతీయంగా చమురు ధరల్లో ఒడిదొడుకులు
- ధరల తగ్గింపు భారత్ చేతుల్లో లేదన్న మంత్రి
రూపాయితో పోలిస్తే డాలర్ బాగా బలపడిందని, అందుకు అనుగుణంగానే పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని ఆయన వివరించారు. ఇరాన్, వెనిజులా, టర్కీ దేశాల్లో చమురు ఉత్పత్తిపై విపరీతమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. చమురు ధరలను నియంత్రించే అవకాశాలు భారత్ చేతిలో ఎంతమాత్రమూ లేవని తేల్చి చెప్పారు.
మరోవైపు, పెట్రో ధరల పెంపునకు నిరసగా సోమవారం కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు సిద్ధమవుతోంది. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ తమతో కలిసి రావాల్సిందిగా కోరింది. వామపక్షాలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించగా, ఏపీ, తెలంగాణలలో నిరసనల్లో పాల్గొనాలని జనసేన నిర్ణయించింది. తెలుగుదేశం కూడా నిరసనల్లో పాల్గొననుంది.