Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్లూరి రమేశ్

  • రేపు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నారు
  • అందుకే, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • సందడిగా మారిన తెలంగాణ సచివాలయం
రేపు ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతుందని టీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆలూరి రమేశ్ వ్యాఖ్యానించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రేపు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నారు కనుకనే నియోజక వర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. ‘రేపు తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడం ఖాయమా?’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘హండ్రెడ్ పర్సెంట్’ అని అన్నారు.

కాగా, తెలంగాణ సచివాలయం సందడిగా మారింది. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సచివాలయానికి చేరుకున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధులు, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 
TRS
valluri ramesh

More Telugu News