గుట్కా కుంభకోణం కేసు.. తమిళనాడు మంత్రి, డీజీపీ ఇళ్లపై సీబీఐ దాడులు!
- తమిళనాడు రాజధాని చెన్నైలో తనిఖీలు
- మంత్రి విజయ భాస్కర్, డీజీపీ రాజేంద్రన్ ఇళ్లలో సోదాలు
- గుట్కా అమ్మకాల అనుమతులకు భారీ లంచాలు
గుట్కా తయారీదారుల ఇళ్లపై ఐటీ శాఖ 2016లో నిర్వహించిన దాడుల ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత గుట్కా అమ్మకానికి వాటి తయారీదారులు మంత్రి విజయ భాస్కర్ తో పాటు డీజీపీ రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్, మరికొంత మంది అధికారులకు రూ.39.91 కోట్లు లంచాల రూపంలో చెల్లించినట్లు తేలింది. వీరు గుట్కా మాఫియా నుంచి నెలకు రూ.53 లక్షల చొప్పున అందుకున్నట్లు కొన్నిపత్రాలు కూడా అప్పట్లో లభ్యమయ్యాయి.
ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం సరైన తీరులో స్పందించకపోవడంతో డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్కా కుంభకోణంపై న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆధారాల సేకరణ కోసం సీబీఐ దాడులు నిర్వహించింది.