కింగ్‌కోఠిలో సిగ్నల్ దగ్గర ఆగిన కేటీఆర్.. మంత్రితో సెల్ఫీలు దిగిన యువత!

  • కింగ్ కోఠి వద్ద ఆగిన మంత్రి కాన్వాయ్
  • హాయ్ చెప్పి సెల్ఫీ దిగిన బెంగళూరు అమ్మాయి
  • ఆ తర్వాత క్యూకట్టిన యువత
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యువతను మరోమారు ఫిదా చేశారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కింగ్ కోఠి మీదుగా వస్తున్న కేటీఆర్ కాన్వాయ్ సిగ్నల్ వద్ద ఆగింది. కారులో ఉన్న మంత్రిని చూసిన బెంగళూరుకు చెందిన ఓ యువతి విష్ చేసింది. ప్రతిగా కేటీఆర్ చిరునవ్వుతో కారు దిగి, హాయ్ అంటూ పలకరించారు.

ఆ వెంటనే మాటలు కలిపిన యువతి తనకు సెల్ఫీ కావాలని రిక్వెస్ట్ చేసింది. దీనికి సరేనన్న కేటీఆర్ కారులోంచి కిందికి దిగి ఆమెతో సెల్ఫీ దిగారు. ఆమె ఖుషీ అయిపోగా, ఇది చూసిన మరికొందరు మంత్రితో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. మంత్రి సహనంగా అందరితోనూ సెల్ఫీలు దిగడంతో యువత సంతోషం వ్యక్తం చేసింది. మంత్రితో తాము దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఎక్కడ చూసినా అవే కనిపించాయి.
Go Back to Shorts
Telangana
Minister
KTR
Selfie
King koti
Hyderabad

More Telugu News