రాజకీయ ప్రవేశంపై మరోసారి స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ!

  • ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నా
  • వాటి పరిష్కారం కోసం అవసరమైతే రాజకీయాల్లోకి
  • కడపలో మీడియాతో లక్ష్మీ నారాయణ
ప్రస్తుతం తాను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నానని, వాటి పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే కచ్చితంగా వస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియ నుంచి మద్యం, కులం, డబ్బును పారద్రోలేందుకు ప్రజలు నడుం బిగించాలని కోరారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తాను కూడా పోరాటానికి సిద్ధమని చెప్పారు. వ్యవసాయ, చేనేత కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా ఓ మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడించిన లక్ష్మీ నారాయణ, కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
CBI
EX JD
Lakshmi Narayana
Politics

More Telugu News