సానుకూలంగా జనసేన, సీపీఎం ప్రాథమిక చర్చలు

02-09-2018 Sun 20:22 | Both States
  • ‘తెలంగాణ’లో కలిసి పనిచేయడంపై ఇరు పార్టీల భేటీ
  • ఈ రోజు సీపీఎం ప్రతినిధి బృందంతో చర్చించాం
  • ఈ చర్చల సారాంశాన్ని జనసేన అధ్యక్షుడుకి వివరిస్తాం
తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొన్న క్రమంలో జనసేన పార్టీతో కలిసి పని చేయాలనే అభిలాషను వ్యక్తం చేసిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులతో నిర్వహించిన ప్రాథమిక చర్చలు సానుకూలంగా సాగాయి. ఈ విషయాన్ని ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) కన్వీనర్ మాదాసు గంగాధరం తెలిపారు.

హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల ప్రతినిధులు భేటీ అయ్యారు. ‘జనసేన’ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్, ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి  పి.హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్ ఛార్జ్ ఎన్.శంకర్ గౌడ్, సీపీఎం తరఫున తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు,  జి.రాములు,  డి.జి.నరసింహులు పాల్గొన్నారు.

మాదాసు గంగాధరం మాట్లాడుతూ, ‘పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు సీపీఎం ప్రతినిధి బృందంతో చర్చించాం. ‘జనసేన’ సిద్ధాంతాలు, సీపీఎం భావాల మధ్య సారూప్యత ఉండటంతో చర్చలు సానుకూలంగా సాగాయి. తెలంగాణాలో ఉన్న రాజకీయ పరిణామాలు, మారే పరిస్థితులను బేరీజు వేశాం. ఈ చర్చల సారాంశాన్ని జనసేన అధ్యక్షుడుకి వివరించి, వారి ఆదేశాలతో ముందుకు వెళ్తాం’ అని అన్నారు.

తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ‘తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో ‘జనసేన’తో కలిసి పని చేయాలి. మా రెండు పార్టీల మధ్య భావ సారూప్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ‘జనసేన’తో కలిసి పని చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ‘తెలంగాణ’లో కూడా కలిసి ఉండాలి. ప్రాథమిక దశ చర్చలు సానుకూలంగా సాగాయి’ అని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో చర్చించాలని, అందుకోసం మరోసారి సమావేశమవుతామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
jenasenaPawan Kalyancpm

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more