ప్రగతి నివేదన సభకు చేరుకున్న మంత్రులు.. అలరిస్తున్న కళాకారులు!

  • సభకు చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు  
  • ఆటపాటలతో ఉత్సాహం నింపుతున్న కళాకారులు
  • తెలంగాణ జానపద గీతాలతో మార్మోగుతున్న వేదిక  
కొంగరకలాన్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి, ఎంపీ కవిత తదితరులు చేరుకున్నారు.

మరోపక్క, తమ ఆటపాటలతో కళాకారులు సభికులలో ఉత్సాహం నింపుతున్నారు. తెలంగాణ జానపద గీతాలతో సభా వేదిక మార్మోగుతోంది. కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. కొంగరకలాన్ సభా వేదిక వద్దకు హెలికాప్టర్ ద్వారా ఆయన చేరుకోనున్నారు. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.
Go Back to Shorts
anam ramnarayana reddy

More Telugu News