అన్నీ బుల్లెట్ బైకులే... బలాన్ని చూపుతున్న తలసాని!
- భారీ బుల్లెట్ ర్యాలీ, 250 బస్సులు, 1000 కార్లు
- దాదాపు 50 వేల మందిని తరలించిన తలసాని
- ఇది ఎన్నికల శంఖారావమే
- ఇంత భారీ సభ నిర్వహించి చూపాలని విపక్షాలకు సవాల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో ఈ సభ ఓ చరిత్రను సృష్టించనుందని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఇప్పటివరకూ ఏ జాతీయ పార్టీగానీ, ప్రాంతీయ పార్టీగానీ ఇంత పెద్ద బహిరంగ సభను నిర్వహించలేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే గత నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చాటి చెప్పేందుకే ఈ సభను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. ఈ ప్రగతి నివేదన సభను రానున్న అసెంబ్లీ ఎన్నికల శంఖారావంగానే భావిస్తున్నామని అన్నారు. ఏమీ చేతకాని విపక్షాలు, తమ సభ మీదపడి ఏడుస్తున్నాయని ఆయన విమర్శించారు. దమ్ముంటే ఇతర రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో సభను నిర్వహించి చూపాలని తలసాని సవాల్ విసిరారు.