'సైరా'కోసం టబూను ఒప్పించే ప్రయత్నాల్లో చరణ్
- షూటింగు దశలో 'సైరా'
- కీలక పాత్ర కోసం టబూతో సంప్రదింపులు
- ఆమధ్య 'పాండురంగడు'లో నటించిన టబు
ఇంకా టబూతో సంప్రదింపులు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. చరణ్ .. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టబూ ఓకే అంటే త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలుగులో బాలకృష్ణతో చేసిన 'పాండురంగడు' ఆమె చివరి చిత్రం. టబూ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే .. 'పాండురంగడు' తరువాత ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది.