Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అదుగో' నుంచి ఫస్టులుక్ వచ్చేసింది

  • పందిపిల్ల ప్రధాన పాత్రగా 'అదుగో'
  • టైటిల్ లో 'అ' సెంటిమెంట్  
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    
తెలుగు తెరపై నటుడిగా .. దర్శకుడిగా రవిబాబు స్థానం ప్రత్యేకం. 'అల్లరి' .. 'లడ్డూ బాబు' వంటి కామెడీ సినిమాలు, 'నచ్చావులే' వంటి ప్రేమకథా చిత్రాలు .. 'అవును' .. 'అనసూయ' .. 'అమరావతి' వంటి హారర్ చిత్రాలు దర్శకుడిగా ఆయన ప్రతిభకి అద్దం పడుతుంటాయి. ఈ సారి కూడా ఆయన 'అ' సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ 'అదుగో' అనే సినిమాను రూపొందించాడు.

ఒక పందిపిల్లను ప్రధాన పాత్రగా చేసుకుని ఆయన ఈ సినిమాను రూపొందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఒక ఫస్టులుక్ ను వదిలాడు. పందిపిల్ల .. హాయ్ అని పలకరిస్తూ తన పేరు 'బంటీ' అంటూ పరిచయం చేసుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ ను వదిలారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పందిపిల్లతో రవిబాబు చేసిన ప్రయోగం ఎలాంటిదో తెలుసుకోవడానికి అంతా కూడా చాలా ఆసక్తిగా వున్నారు.    
ravibabu

More Telugu News