దర్శకురాలు జయ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి.. బిఏ రాజుకు పరామర్శ
- జయ మృతి జీర్ణించుకోలేని విషయం
- చిత్రపరిశ్రమకు తీరనిలోటు
- బిఏ రాజు నాకు చిరకాల మిత్రుడు
జయ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చిత్రపరిశ్రమకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. బిఏ రాజు తనకు చిరకాల మిత్రుడని, చెన్నైలో ఉన్నప్పటి నుంచి వీళ్లిద్దరితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చిరంజీవి చెప్పారు.