మైదానంలోనే బట్టలు మార్చుకున్న క్రీడాకారిణి అలైజ్ కార్నెట్!
- టాప్ ను సరిగ్గా వేసుకురాని కార్నెట్
- గుర్తించి సైగ చేసిన బాయ్ ఫ్రెండ్
- కోర్టులోనే మార్చేసుకున్న ఆమెకు చైర్ అంపైర్ హెచ్చరిక
- పురుషులకు లేని నిబంధనలు తమకెందుకంటున్న మాజీలు
కార్నెట్ తన తొలి మ్యాచ్ ని జొహన్నా లార్సన్ తో ఆడుతున్న వేళ, తన టాప్ ను సరిగ్గా ధరించకుండా కోర్టులోకి వచ్చింది. వెనుకభాగం ముందుకు వచ్చేలా ఆమె టాప్ ధరించగా, బాయ్ ఫ్రెండ్ గుర్తించి సైగ చేశాడు. దీంతో ఆమె మళ్లీ లాకర్ రూములోకి ఎందుకు వెళ్లాలని భావించిందో ఏమో, పదంటే పది సెకన్లలో తన టాప్ ను పైకి తీసి, సరిచేసుకుని ధరించింది. ఆమె చేసిన పనికి చైర్ అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కార్నెట్ కు మద్దతు పలుకుతూ, పలువురు కామెంట్లు చేస్తుండటంతో యూఎస్ ఓపెన్ నిర్వాహకులు, ఆమెకు వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సిందని ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.