గౌతమ్ కు అప్పుడే 12 ఏళ్లు వచ్చేశాయ్!: పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఈరోజు 12వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా గడిచిపోతుందనీ, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్లకు చేరుకున్నాడని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు.
‘కాలం చాలా వేగంగా గడిచిపోతోం ది. అప్పుడే నా కుమారుడికి 12 ఏళ్లు వచ్చేశాయి. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు.