harikrishna: ఆర్టీసీలో మహిళా కండక్టర్ల నియామకం హరికృష్ణ చలవే!

ప్రముఖ నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ బుధవారం నల్లొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణ కారణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీల్లో మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారన్నది వాస్తవం. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రవాణాశాఖ మంత్రిగా ఉన్న హరికృష్ణ అప్పట్లోనే ఆర్టీసీలో మహిళా కండక్టర్ల నియామకానికి చొరవ తీసుకున్నారు.

టీడీపీలో ఉన్నా తనకు నచ్చని విషయాల్లో పార్టీ అధిష్ఠానాన్ని సైతం హరికృష్ణ ధిక్కరించేవారు. ఏ విషయంలో అయినా డొంకతిరుగుడుగా మాట్లాడటం ఆయనకు నచ్చని పని. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడేవారు. అలాగే ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఉండాలనీ, అమ్మాయిలు ఎలాంటి విధులనైనా సమర్థవంతంగా నిర్వహించగలరని హరికృష్ణ తరచూ చెప్పేవారు. అందుకు అనుగుణంగానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మహిళా కండక్టర్ల నియామకంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
harikrishna
apsrtc
women conductors

More Telugu News