ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ'
- ఎమ్మెస్ రాజు నుంచి 'అగధ'
- ప్రధానమైన పాత్రలో జోవిక
- 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా
- 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్
ఆధ్యాత్మిక రహస్యాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి .. ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తూనే ఉంటాయి. దైవిక శక్తులు .. అవి చూపించే ప్రభావం చుట్టూ ఈ తరహా కథలు నడుస్తూ ఉంటాయి. ఇలాంటి కథలు గతంలో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రూపొందాయి. కథాకథనాల పరంగా అలరిస్తూ, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. అలాంటి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానే 'అగధ'.
ఆధ్యాత్మిక రహస్యాలు .. దైవిక శక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. అందువలన గ్రాఫిక్స్ కి ఎక్కువ అవకాశం ఉన్న కంటెంట్ ఇది. సినిమా నిడివిలో 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతుండటం ఆడియన్స్ లో మరింత ఉత్కంఠను పెంచుతోంది. 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా, సంచలనాన్ని సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.