Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్ననాటి హ‌రికృష్ణ.. అరుదైన ఫొటోను షేర్ చేసిన క్రిష్‌!

  • ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ
  • రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథి అంటూ ట్వీట్
  • తండ్రి ముందు నడిచిన వారసత్వం అంటూ కామెంట్
నందమూరి హరికృష్ణ హఠాన్మరణం చిత్ర సీమను విషాదంలో ముంచేసింది. సినీ పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. సినీ ప్రముఖలంతా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణకు చెందిన ఓ అరుదైన ఫొటోను దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చిన్న వయసులో తన తండ్రి ముందు నడుస్తున్న హరికృష్ణ ఈ ఫొటోలో ఉన్నారు. 'మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథి... చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం' అంటూ క్రిష్ ట్వీట్ చేశారు. 1962లో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ అని పేర్కొన్నారు.
hari krishna
krish
tweet

More Telugu News