కేసీఆర్ ను కలిసిన బీజేపీ నేతలు.. వాజ్ పేయి విగ్రహ ప్రతిష్ఠకు స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి!
- క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్న నేతలు
- విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటుపై చర్చ
- ఢిల్లీ టూర్ తర్వాత కేసీఆర్ తొలి అపాయింట్ మెంట్
ఢిల్లీ పర్యటన తర్వాత ఏ నాయకుడికి అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ బీజేపీ నేతలను కలుసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీగా సహకరించుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.