మద్యం తాగకపోయినా తాగినట్టు చూపించిన బ్రీత్ అనలైజర్... హైదరాబాద్ పోలీసులపై కేసు!
- సుల్తాన్ బజార్ లో డ్రంకెన్ డ్రైవ్
- మద్యం తాగకున్నా బీఏసీ 43 చూపించిన బ్రీత్ అనలైజర్
- వైద్య పరీక్షల్లో మద్యం తాగలేదని నిర్ధారణ
తాను మద్యం తాగలేదని, తనకు ఆ అలవాటు లేదని చెప్పినా పోలీసులు వినలేదు. బలవంతంగా అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఆ వెంటనే జరిగిన ఘటనపై సుల్తాన్ బజార్ లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ లో సయ్యద్ ఫిర్యాదు చేశాడు. తాను తాగకపోయినా, తప్పుడు మెషీన్ తో పరీక్షించి కేసు పెట్టారని అతను ఫిర్యాదు చేయగా, ఆ వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని తీసుకెళ్లారు. ఈ పరీక్షల్లో జహంగీర్ మద్యం తాగలేదని వైద్యులు నిర్ధారించగా, ట్రాఫిక్ పోలీసులపై కేసు నమోదైంది.