వైసీపీ అధినేత జగన్ ని కలిసిన ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు
- వైసీపీ అధినేత జగన్ ని కలిసిన సాంబశివరావు
- జగన్- సాంబశివరావుల మధ్య 15 నిమిషాల చర్చ
- పార్టీలో చేరే విషయమై ప్రస్తావన?
కాగా, మాజీ డీజీపీ సాంబశివరావు త్వరలో వైసీపీలో చేరనున్నట్టు, ఈ నేపథ్యంలోనే జగన్ ని ఆయన కలిసినట్టు వైస్సార్సీపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సాంబశివరావు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు.1987లో ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి ఏఎస్పీగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పదోన్నతులు పొందుతూ డీజీపీ స్థాయికి ఎదిగారు. ఏపీ డీజీపీగా గత ఏడాది ఆయన పదవీ విరమణ పొందారు.