prabhas: 'సాహో' కోసం ఫిల్మ్ సిటీలోనే ఉండిపోతోన్న ప్రభాస్!

  • ఫిలిం సిటీలోనే యూనిట్ కి వసతి సౌకర్యాల ఏర్పాటు 
  • వారానికొకసారి ఇళ్లకు వెళ్లివచ్చేలా ప్లానింగ్ 
  • ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ  
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా ప్రభాస్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి, ప్రభాస్ తో పాటు ఇతర ముఖ్య పాత్రధారులకు .. సాంకేతిక నిపుణులకు ఫిల్మ్ సిటీలోనే వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారట.

ఉదయం మొదలైన షూటింగ్ నాన్ స్టాప్ గా రాత్రి వరకూ కొనసాగుతోందట. ఒకవేళ సాయంత్రం షూటింగ్ పూర్తయినా అక్కడి నుంచి సిటీకి చేరుకుని, మళ్లీ ఉదయాన్నే బయలుదేరవలసి ఉంటుంది. ట్రాఫిక్ సమస్యల వలన ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో, ఫిల్మ్ సిటీలోనే వుండే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. వారానికి ఒకసారి మాత్రమే అంతా ఇళ్లకి వెళ్లి వచ్చేలా ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధాకపూర్ కన్పించనున్న సంగతి తెలిసిందే.     
prabhas
shraddha

More Telugu News