Pawan Kalyan: చేతికి రాఖీ కట్టినా, కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డనీ మన ఇంటి బిడ్డగానే గౌరవించుకుందాం: పవన్ కల్యాణ్

  • రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • ఆడబిడ్డల గౌరవ మర్యాదలని కాపాడాలి
  • ఉజ్వల భవితకు చేయూతను అందిద్దాం
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన శుభాకాంక్షలని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చేతికి రాఖీ కట్టినా, కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డనీ మన ఇంటి బిడ్డగానే గౌరవించాలని, అక్కాచెల్లెళ్ల గౌరవమర్యాదలు కాపాడాలని పిలుపునిచ్చారు.

'రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరుఫున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు. సోదర ప్రేమకు ప్రతిరూపంగా.. మావన సంబంధాలను పరిపుష్టం చేసేలా రక్షా బంధన్ వేడుకలను చేసుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక ఈ వేడుక. చేతికి రాఖీ కట్టినా, కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డనీ మన ఇంటి బిడ్డగానే గౌరవించుకుందాం. అక్కాచెల్లెళ్ల గౌరవమర్యాదలు కాపాడి వారి ఉజ్వల భవితకు చేయూతను అందిద్దాం’ అంటూ పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telangana

More Telugu News