డీఆర్డీవో చైర్మన్ గా సతీశ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు

  • ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు
  • ప్రస్తుతం రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సతీశ్
  • నావిగేషన్, ఏవియానిక్స్ రంగాల్లో విశేష పరిశోధనలు చేసిన సతీశ్
రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ గా సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు హోదాలో ఆయన ఉన్నారు. కాగా, నెల్లూరు జిల్లాకు చెందిన సతీశ్ రెడ్డి అనంతపురంలో బీటెక్, జేఎన్టీయూ హెచ్ లో ఎంఎస్ పూర్తి చేశారు. 1985లో డీఆర్డీవోలో చేరారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు చేశారు. మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సలహాదారుగా నియమితులయ్యారు. అంతకుముందు, హైదరాబాద్ డీఆర్డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కు సతీశ్ రెడ్డి డైరెక్టర్ గా పనిచేశారు.
Go Back to Shorts
drdro
chairman
sastish reddy

More Telugu News