నేడు.. ఫ్లిప్‌ కార్ట్‌ లో డిస్కౌంట్‌ సేల్‌!

  • పలు వస్తువులపై 10 నుంచి 80 శాతం రాయితీ
  • హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌
  • నెలసరి వాయిదాలపై చెల్లింపునకు అవకాశం
ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి శుభవార్త. ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఒకరోజు బంపర్‌ సేల్‌ ఆఫర్‌ను అందిస్తోంది. సూపర్‌ సేల్‌ పేరుతో శనివారం ఒక్కరోజూ పలు వస్తువులపై 10 నుంచి 80 శాతం రాయితీ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఉన్న వారికి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది.

టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌తో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు, ఆడియో వస్తువులు, కెమెరాలు, బ్లూటూత్‌ స్పీకర్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. ఇక ఫర్నిచర్, కిచెన్ వస్తువులపై 40 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. అలాగే, స్మార్ట్‌ టీవీలను ఆకట్టుకునే ధరలపై అందిస్తామంది. ఫ్లాష్‌ సేల్‌ పేరుతో గంటగంటకూ ఆఫర్లు ప్రకటిస్తోంది. మరో విషయం ఏమిటంటే, నెలసరి వాయిదాల పద్ధతి చెల్లింపు సౌకర్యం కూడా కల్పిస్తోంది.
Go Back to Shorts
Flipkart

More Telugu News