ప్రభుత్వ అకౌంటెంట్ పోస్టుకు పరీక్ష రాసిన 10 వేల మంది.. అందరూ ఫెయిలే!
- 80 పోస్టులకు 10 వేల మంది హాజరు
- ఒక్కరూ కనీస అర్హత మార్కులు సాధించలేదు
- దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు
ఈ పోస్టుల భర్తీకి జనవరి ఒకటో తేదీన నిర్వహించిన పరీక్షలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాలేదని అకౌంట్స్ డైరెక్టర్ ప్రకాశ్ పెరీరా తెలిపారు. ఈ పరీక్షేమీ అంత కఠినమైనది కూడా కాదని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చినట్టుగా ప్రశ్నలు ఇచ్చామని ఆయన వివరించారు. కనీస అర్హత మార్కులను కూడా ఎవరూ సాధించలేకపోయారని పేర్కొన్నారు.
పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదని ప్రభుత్వం ప్రకటించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించింది. ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాకుండా ఎలా ఉంటారని కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి సందానంద్ షెట్ తన్వాడే మాట్లాడుతూ రిక్రూట్మెంట్ విధానంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.