కేరళకు ఏకంగా రూ.700 కోట్ల విరాళం!: యూఏఈ పాలకుల ఔదార్యం
- పెద్ద మనసు చాటుకున్న యూఏఈ పాలకులు
- కేరళకు భారీ సాయం ప్రకటించిన అరబ్ దేశం
- కృతజ్ఞతలు తెలిపిన సీఎం విజయన్
యూఏఈ రూ.700 కోట్ల విలువైన సాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. తమపై ఎంతో ప్రేమ చూపిన యూఏఈ ప్రభుత్వానికి, పాలకులకు విజయన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వరదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మొత్తం రూ.600 కోట్ల సాయం మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్షం ఈ రోజు సాయంత్రం తిరువనంతపురంలో భేటీ కానుంది.