బాలీవుడ్ నటి సుజాత కుమార్ మృతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ నటి సుజాత కుమార్ మృతి!

  • కేన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సుజాత  
  • బాలకృష్ణ సినిమా 'లెజండ్'లో కూడా నటించింది  
  • 'ఇంగ్లీష్ వింగ్లిష్'లో శ్రీదేవికి సోదరిగా నటించిన సుజాత 
పలు సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ పోషించిన బాలీవుడ్ నటి సుజాతా కుమార్ మరణించారు. సినిమాల్లోనే కాక అనేక సీరియల్స్ లో కూడా తనదైన శైలిలో నటించి గుర్తింపు తెచ్చుకుంది సుజాత. ఆమె గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ నటి శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంలో సుజాత ఆమెకు సోదరి పాత్రలో చక్కని నటనను ప్రదర్శించారు. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంలో ఆయనకు బామ్మ పాత్రలో నటించారు. 'హోటల్‌ కింగ్‌డమ్‌’, ‘బాంబే టాకింగ్‌’, ‘24’ అనే టీవీ సీరియల్స్ లోనూ ఆమె నటించారు. సుజాతా కుమార్ ఇక లేరు అన్న విషయాన్ని ఆమె సోదరి, నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నా సోదరి సుజాత కుమార్‌ ఇకలేరు. ఆదివారం రాత్రి 11.26 గంటలకు కన్నుమూశారు’ అని పేర్కొన్నారు.  
sujathakumar
Sridevi

More Telugu News