New Delhi: హస్తిన వీధుల్లో న్యూడ్ గా వీరంగం... రచ్చ రచ్చ చేసిన ట్రాన్స్ జెండర్లు!

  • ట్రాన్స్ జెండర్ల వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు
  • వీధుల్లో వీరంగం సృష్టించిన ట్రాన్స్ జెండర్లు
  • ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా ట్రాన్స్ జెండర్ల వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న ట్రాన్స్ జెండర్లు గత రాత్రి వీధుల్లో వీరంగం సృష్టించారు. నగ్నంగా తిరుగుతూ రచ్చరచ్చ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను పలువురు తన స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టులు చేయగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

రెండు గ్రూపులుగా ఏర్పడిన ట్రాన్స్ జెండర్లు, సౌత్ ఢిల్లీ, గ్రీన్ పార్క్ రోడ్డులో ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. తమ బట్టలన్నీ విప్పి, కనిపించిన వాహనాలపై నృత్యాలు చేశారు. వీరు చేపట్టిన నిరసన అత్యంత జుగుప్సాకరంగా సాగింది. దీనిపై స్పందించిన పోలీసులు, ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు తమకు కనిపిస్తే అడ్డుకుంటున్నామని, నిరసనలు తెలిపే చోట ఇటువంటి పనులు చేయవద్దని వారిని హెచ్చరిస్తున్నామని అన్నారు. గత రాత్రి ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే, ఈ తరహా ఘటనలు తగ్గుతాయని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
New Delhi
Transgenders
Protest

More Telugu News