పుస్తకంలోని దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయ్!: 'గూస్ బంప్స్ 2' ట్రైలర్ విడుదల
- ఆకట్టుకుంటున్న ట్రైలర్
- దయ్యాలతో పిల్లల పోరాటం
- అక్టోబర్ 12న సినిమా రిలీజ్ కు సన్నాహాలు
తాజాగా అరిశాండల్ దర్శకత్వంలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ‘గూస్ బంప్స్-2 ది హంటెడ్ హాలోవీన్’ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ముగ్గురు పిల్లలు ఈ భయంకర జంతువులు, భూతాలు దాగిన పుస్తకాన్ని తెరవడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. తోడేలు మనిషి, దయ్యాలు, మనుషులపై దాడిచేసే జెల్లీ బేర్ లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ ముగ్గురు పిల్లలు దయ్యాలు, భయంకరమైన జంతువులతో పోరాడుతున్న సీన్లు సూపర్బ్ గా ఉన్నాయి.
ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోనీ పిక్చర్ యానిమేషన్, కొలంబియా పిక్చర్స్, ఒరిజినల్ ఫిల్మ్ సంస్థలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రచయిత ఆర్.ఎల్.స్టైన్ రాసిన గూస్ బంప్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.