రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభుదేవా మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభుదేవా మూవీ

  • డాన్స్ ప్రధానంగా సాగే కథ 
  • ముఖ్య పాత్రల్లో ప్రభుదేవా .. ఐశ్వర్య రాజేశ్ 
  • ఈ నెల 24వ తేదీన విడుదల    
తెలుగు తెరపై డాన్స్ ప్రధానంగా సాగే కథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అలా తాజాగా డాన్స్ ప్రధానంగా ఒక సినిమా రూపొందింది. డాన్సర్ అయిన 'లక్ష్మి' అనే ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందువల్లనే ఈ సినిమాకి 'లక్ష్మి' అనే పేరును ఖరారు చేశారు.

ప్రధానమైన 'లక్ష్మి' పాత్రలో దిత్యా భాన్డే కనిపించనుంది. ప్రభుదేవా .. ఐశ్వర్య రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. యూత్ లో స్ఫూర్తిని పెంపొందింపజేసే కంటెంట్ తో వస్తోన్న ఈ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.    
prabhudeva
dithya

More Telugu News