'సారీ... పెళ్లయిపోయింద'ని చెబుతూనే ప్రియురాలిపై అత్యాచారం!
- పదేళ్లుగా యువతిని ప్రేమించిన బేగంపేట యువకుడు
- మూడు నెలల క్రితం మరో పెళ్లి
- ప్రియురాలిని పిలిపించుకుని అత్యాచారం
- నిర్భయ చట్టం కింద కేసు నమోదు
అక్కడికి వెళ్లిన తరువాత ఆమెకు అసలు విషయం చెప్పాడు. తనకు మూడు నెలల క్రితం పెళ్లయిపోయిందని, తనను క్షమించాలని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఆమెను కొట్టిన అతను, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తనను మోసం చేయడంతో పాటు లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ, సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో, అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.