మహాత్మాగాంధీది కూడా ఈ దేశం కాదంటారేమో: అమిత్ షాపై మమత ఫైర్
- ఎన్ఆర్సీ గుర్తించిన వారిలో 38 లక్షల మంది బంగ్లా మాట్లాడే హిందువులు, ముస్లింలే
- జమిలి ఎన్నికలను మేము వ్యతిరేకిస్తున్నాం
- కేంద్ర ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రాలు కూడా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?
జమిలి ఎన్నికలను నిర్వహించడం సాధ్యంకాదని మమత అన్నారు. ఇలాంటి పద్ధతి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే సరిపోతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించిన పక్షంలో... ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పడిపోతే, అప్పుడు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అప్పుడు కేంద్రం, రాష్ట్రాలు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అని అడిగారు. ఇలాంటి కారణాల వల్లే తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.