గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన కేసీఆర్

  • పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద నివాళి అర్పించిన కేసీఆర్
  • అక్కడ నుంచి నేరుగా గోల్కొండ కోటకు పయనం
  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ఆయన పరేడ్ మైదానంలో ఉన్న సైనికుల స్మారకం వద్ద ఘన నివాళి అర్పించారు.

అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు వెళ్లిన ముఖ్యమంత్రి... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.



Go Back to Shorts
kcr
independence day
flag
hoisting

More Telugu News