పాస్‌పోర్టు జారీలో చిక్కు ప్రశ్నలకు స్వస్తి.. దరఖాస్తు ఇక మరింత సులభం!
- ఏడాది చిరునామా నిబంధన తొలగింపు
- ఇద్దరు పరిచయస్తుల పేర్లూ అవసరం లేదు
- వెల్లడించిన విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి
ఇప్పుడీ నిబంధనను పూర్తిగా తొలగించారు. ఇకపై ఈ నిబంధన ఉండదని, దరఖాస్తులో ఎవరి పేర్లను రాయాల్సిన అవసరం లేదని విశాఖపట్టణం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్ఎల్పీ చౌదరి తెలిపారు. అలాగే, దరఖాస్తుదారుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటూ విచారణకు పంపే పోలీసులకు గతంలో తొమ్మిది ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు వీటిని కుదించి ఆరు ప్రశ్నలకు తగ్గించారు. ఫలితంగా పాస్ట్‌పోర్టు దరఖాస్తు మరింత సులభతరం కావడంతో పాటు జారీ ప్రక్రియలో కూడా వేగం పెరగనుంది.
తనిఖీలో భాగంగా దరఖాస్తుదారుతో గానీ, వారి తల్లిదండ్రులతో గానీ పోలీసులు మాట్లాడాల్సిన పనిలేదు. అసలు వారి ఇంటికీ వెళ్లనవసరంలేదు. మొత్తం మీద దరఖాస్తుదారుపై పోలీసు కేసులేమైనా వున్నాయా? లేవా? ఇండియన్ అవునా? కాదా? అనే విషయాలను పోలీసులు ధృవీకరిస్తే సరిపోతుందని విదేశాంగ శాఖ స్పష్టంగా పేర్కొంది.