అభిమానులకు భావోద్వేగ మెసేజ్ ను పంపిన కోహ్లీ
- కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు నేర్చుకుంటాం
- గెలవాలనే పట్టుదలతోనే మేము ఆడతాం
- మిమ్మల్ని అలరించడానికి వంద శాతం ప్రయత్నిస్తాం
లార్డ్స్ టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, తాము చేసిన తప్పిదాలను అంగీకరిస్తున్నామని, మూడో టెస్టులో అవి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపాడు. మూడో టెస్టులో గెలవడంపైనే తమ దృష్టి ఉందని చెప్పాడు. టెస్టులో 20 వికెట్లను పడగొట్టగలిగే బౌలింగ్ సత్తా మనకుందని, కానీ బ్యాటింగ్ విభాగమే ఆందోళనకు గురి చేస్తోందని అన్నాడు. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తే, బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.