నువ్వు నోరుముయ్యకుంటే...శాశ్వతంగా నీ నోరు మూసేస్తాం!: విద్యార్థి నాయకురాలు షీలాకు మాఫియా డాన్ బెదిరింపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నువ్వు నోరుముయ్యకుంటే...శాశ్వతంగా నీ నోరు మూసేస్తాం!: విద్యార్థి నాయకురాలు షీలాకు మాఫియా డాన్ బెదిరింపు!

  • ఖలీద్, జిగ్నేష్ లకూ ఇదే గతి
  • రవి పుజారి నుంచి మెసేజ్
  • పోలీసులకు షీలా ఫిర్యాదు
విద్యార్థి సంఘాల నాయకురాలు షీలా రషీద్ షోరాకు మాఫియా డాన్ రవి పుజారి నుంచి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో ఉమర్ ఖలీద్ పై హత్యాయత్నం జరిగిన రోజే ఆమె సెల్ ఫోన్ కు '+60176206085' నంబరు నుంచి రవి పేరిట బెదిరింపులు రాగా, ఆమె జమ్మూ కశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు ఖలీద్, జిగ్నేష్ మేవానీలను సైతం ఆయన బెదిరించాడని ఆరోపించారు.

 "నీ నోరు మూసుకో... లేకుంటే మేమే నీ నోరు శాశ్వతంగా మూసేస్తాం. ఇదే విషయాన్ని ఉమర్ ఖలీద్, జిగ్నేష్ మేవానీకి కూడా చెప్పు" అని తనకు మెసేజ్ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆర్పీసీ సెక్షన్ 506 కింద 45/2018 యూ/ఎస్ కింద కేసు నమోదైందని షీలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
Mafia Don
Ravi Pujari
Shehla Rashid
Jignesh Mevani

More Telugu News