తమిళంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. విడుదలకు చురుగ్గా ఏర్పాట్లు!

రొటీన్ చిత్రాలకు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


రోల్స్ ప్రైడ్ మీడియా బ్యానర్ పై ‘నెంజమెల్లా పలవన్నం’ పేరుతో ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ సోమవారం చెన్నై, ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ చిత్రానికి ఏఆర్ కే రాజా మాటలు, పాటలు రాశారు. ఈ కార్యక్రమానికి గిల్డ్ అధ్యక్షుడు జాకువార్ తంగం, పీఆర్వో సంఘం చీఫ్ విజయమురళి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల చివరిలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో నెంజమెల్లా పలవన్నం పోస్టర్లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి.
Go Back to Shorts
Seethamma Vakitlo Sirimalle Chettu
Srikanth Addala
Daggubati Venkatesh
Mahesh Babu
Tamilnadu
tamil

More Telugu News