టీడీపీ ఎంపీ మమ్మల్ని అవమానించాడు.. పోలీసులకు ట్రాన్స్ జెండర్ల ఫిర్యాదు!
- విజయవాడలో ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధి
- తమ మనోభావాలు దెబ్బతీశారని వెల్లడి
- వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఈ వ్యవహారంపై విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తన చేష్టలు, మాటలతో శివప్రసాద్ ట్రాన్స్ జెండర్ల మనోభావాలను దెబ్బతీశారని తమన్నా ఆరోపించారు. ఆపరేషన్లు చేసుకుని మహిళలుగా మారిన తమను శివప్రసాద్ తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా ప్రవర్తించినందుకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.