రూ.20 వేల కోట్లు ఇస్తాం.. సీఎం పదవిని వేరే కులస్తులకు ఇస్తారా?: జగన్ కు ముద్రగడ ఛాలెంజ్
- కాపు సేవా సమితి వార్షికోత్సవంలో పాల్గొన్న ముద్రగడ
- కాపు రిజర్వేషన్ పై జగన్ వైఖరి సరికాదు
- తమ డిమాండ్లను నెరవేర్చే పార్టీకే మద్దతన్న నేత
ఈ రోజు గుడివాడలో కాపు సేవా సమితి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. దానికి హాజరైన ముద్రగడ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కాపు కార్పోరేషన్ కు రూ.10 వేల కోట్లు ఇస్తానని జగన్ చెప్పడం సరికాదన్నారు. కాపు రిజర్వేషన్, ఇతర డిమాండ్లను నెరవేర్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. అలాంటి పార్టీల పల్లకినే తాము మోస్తామని ముద్రగడ వ్యాఖ్యానించారు.