'గీత గోవిందం' లీక్ పై స్పందించిన విజయ్.. ఏడుపు వస్తోందని ట్వీట్!
- హర్ట్ అయ్యానని వెల్లడి
- కోపం వస్తోందన్న విజయ్
- ఎడిటింగ్ విభాగం నుంచే సీన్ల లీక్
దీంతో కొందరు అభిమానులు.. ఎన్ని లీకులు ఎదురైనా మనకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని విజయ్ కు ధైర్యం చెప్పారు. చిల్ రౌడీ.. లైట్ తీసుకో అంటూ విజయ్ ను ఓదారుస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులోని కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల వద్ద సినిమా సీన్స్ దొరకటంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సినిమా ఎడిటింగ్ విభాగం నుంచే లీకయిందని తేలింది.