లండన్ వీధుల్లో రేడియోలు అమ్ముతున్న సచిన్ కొడుకు అర్జున్!
- ఫొటో షేర్ చేసిన హర్బజన్ సింగ్
- 50 రేడియోలు అమ్మినట్లు ట్వీట్
- ఎంసీసీ ట్రైనింగ్ లో పాల్గొంటున్న అర్జున్

తన ట్విట్టర్ ఖాతాలో ‘క్రికెట్ కు పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో రేడియోను ఎవరు అమ్ముతున్నారో చూడండి . దాదాపు 50 రేడియోలను అమ్మేశాం. ఇంకొన్ని మాత్రమే మిగిలాయి. జూనియర్ సచిన్. గుడ్ బాయ్‘ అని బజ్జీ ట్వీట్ చేశాడు.
లార్డ్స్ లో భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వర్షం సందర్భంగా పిచ్ ను కవర్ చేసేందుకు అర్జున్ గ్రౌండ్ సిబ్బందికి సాయం చేశాడు.