రోడ్డుపై బీభత్సం సృష్టించిన హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్!
- మందు కొట్టి యాక్సిడెంట్ చేసిన ధ్రువ్
- చెన్నైలోని పాండీ బజార్ సమీపంలో ఘటన
- పోలీసుల అదుపులో ధ్రువ్, కేసు నమోదు
ప్రమాదం జరిగిన సమయంలో ధ్రువ్ మద్యం తాగి ఉన్నట్టు సమాచారం. ధ్రువ్ నడిపిన కారును స్వాధీనం చేసుకున్న పాండీ బజార్ పోలీసులు, అతనిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, గత సంవత్సరం తెలుగులో విడుదలై ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో ధ్రువ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.