ద్వీపాన్నే పైకి లేపిన భూకంపం.. ఇండోనేసియాలో మరో వింత!
- 25 సెంటీమీటర్లు పైకెగసిన లంబోక్ ద్వీపం
- కొన్ని చోట్ల ఆరంగుళాలు కుంగిన నేల
- నిరాశ్రయులైన 3.5 లక్షల మంది
మరికొన్ని చోట్ల భూకంప తీవ్రతకు భూమి 2 నుంచి 6 అంగుళాల కిందకు కుంగిపోయిందని పేర్కొన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ద్వీపం ఎత్తు 25 సెంటీమీటర్లు పెరిగిందని తెలిపారు. ఇండోనేసియాలో భూకంపంతో 68,000 ఇళ్లు ధ్వంసం కాగా, 3.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.